నవతెలంగాణ కల్వకుర్తి టౌన్
క్రీడాకారులు ఉన్న నైపుణ్యాన్ని గుర్తించేందుకే క్రీడలు నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్ నవీన్ తెలిపారు. నవంబర్ 14న నిర్వహించే చిల్డ్రన్స్ డే సందర్భంగా క్రీడాకారులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కల్వకుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న కల్వకుర్తి స్కూల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నాగార్జున తో పాటు YRM కళాశాల యాజమాన్యం మరియు, ఎలైట్ ఇండియా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నామని నవీన్ తెలిపారు. క్రీడాకారులు మంచి నైపుణ్యం కనపర్చి క్రీడల్లో రాణించాలని, ఓటమితో కుంగిపోకుండా విజయం సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉండాలని ఆయన ఆకాంక్షచారు.


