Thursday, January 8, 2026
E-PAPER
Homeకరీంనగర్17వ పోలీస్ బెటాలియన్ లో స్పోర్ట్స్ మీట్

17వ పోలీస్ బెటాలియన్ లో స్పోర్ట్స్ మీట్

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ పరిధి లోని సర్దాపూర్  లో  గల 17వ పోలీస్ బెటాలియన్ లో బెటాలియన్ ఇంటర్ కంపెనీస్ అన్నుయల్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్  ను ముఖ్య అతిధి బెటాలియన్ కమాండంట్ ఎం. ఐ.సురేష్ శాంతి కపోతాలని ఎగరవేసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ  సందర్బంగా బెటాలియన్  కమాండెంట్ ఎం.ఐ. సురేష్, గేమ్స్ లో పాల్గొనే అందరు స్పోర్ట్స్ ఓత్ (ప్రతిజ్ఞ) చేసారు. కమాండంట్ సురేష్ మాట్లాడుతూ విధి నిర్వహణ లో పోలీస్ సిబ్బంది తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ సిబ్బంది మానసిక ఉల్లాసం కోసం ఈ అన్నుయల్ గేమ్స్ &స్పోర్ట్స్ మీట్ ఈనెల 9 వరకు కొనసాగుతుందని తెలిపారు.

అన్నుయల్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ లో భాగంగా క్రికెట్, ,జవాలెన్ త్రో, షాట్ పుట్, తగ్ ఆఫ్ వార్,లాంగ్ జంప్, హై జంప్,5కి.మీ,రన్నింగ్, 100 మీటర్స్ రన్నింగ్,క్యారం బోర్డు, చెస్, షటిల్,వాలీ బోల్ లాంటి గేమ్స్ వుంటాయని తెలిపారు. స్పోర్ట్స్  మీట్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన వారికి స్పోర్ట్స్  మీట్ చివరి రోజున బహుమతులు అందచేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండంట్లు జె.రాందాస్, ఎస్. సురేష్ ,  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్  ప్రమీల ,ఆర్.ఐ లు కుమారస్వామి, శ్రీనివాస్, శ్యాంరావు,వసంతరావు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -