ఎక్సలెంట్ హై స్కూల్ జాతీయ క్రీడా దినోత్సవంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్
నవతెలంగాణ – మణుగూరు
క్రీడలు విద్యార్థులలో జట్టు భావన మరియు ఆరోగ్య పరిరక్షణను పెంపొందిస్తాయని మున్సిపల్ కమిషనర్ టి ప్రసాద్ అన్నారు జాతీయ క్రీడోత్సవాలలో భాగంగా స్థానిక ఎక్సలెంట్ పాఠశాలలో జాతీయ క్రీడ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ టి.ప్రసాద్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంలో స్కూల్ కరస్పాండెంట్ ఖాదర్ ప్రిన్సిపల్ యూసుఫ్ డైరెక్టర్లు యాకూబ్ షరీఫ్ సమీనా పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రీడల ప్రాధాన్యం, ఆరోగ్య పరిరక్షణలో వాటి పాత్ర, జట్టు భావన మరియు క్రమశిక్షణ గురించి వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందంజ వేయాలని ఆయన సూచించారు. తరువాత విద్యార్థుల మధ్య వివిధ క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
క్రీడలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES