Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్పాట్ అడ్మిషన్లను వినియోగించుకోవాలి

స్పాట్ అడ్మిషన్లను వినియోగించుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
మండలంలోని ముప్పారం గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సిఇసి మొదటి సంవత్సరంలో 15 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు విద్యార్థులు వినియోగించుకోవాలని కళాశాల స్పెషల్ ఆఫీసర్ మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాలికల అభ్యున్నతి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన కస్తూర్బా గాంధీ పాఠశాల కళాశాలు నెలకొల్పడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు జరిగిన కళాశాల అడ్మిషన్లలో సిఇసి విభాగానికి చెందిన 15 సీట్లను స్పాట్ అడ్మిషన్లుగా తీసుకోవడం జరుగుతుందని ఈ సదా అవకాశాన్ని బాలికలు వినియోగించుకోవాలని ఆరోపించారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధించిన వివరాల కోసం సెల్ నంబర్ 9866386308 సంప్రదించాల్సిందిగా వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -