- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
బిబిపేట్ఎస్ ఆర్ ఫౌండేషన్(సుభాష్ రెడ్డి) ద్వారా ఐదు రోజుల క్రితం బిబిపేట చెరువు బుంగ పూడ్చేసమయములో ట్రాక్టర్ నడుపుతుండగా అకస్మాత్తుగా మరణించిన విషయం విదితమే. దీంతో మన్నే రమేష్ కుటుంబాన్ని పరామర్శించి రమేష్ దిన ఖర్మల నిమిత్తం ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా రూ.10000 ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్ర సేనరెడ్డి , జనగామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, నేషనల్ వుమెన్ రైట్స్ బిబిపేట మండల చైర్మన్ బోధస్ సాయికుమార్, సిద్ధ రాంరెడ్డి, అశోక్ గౌడ్, నీల స్వామి , రాజమల్లయ్య, నర్సింలు, కిరణ్, గణేష్, ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు, స్ధానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -