- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ భర్త కొండ సమ్మయ్య కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు శుక్రవారం బాధితున్ని పరామర్షించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని, నాణ్యమైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, యూత్ నాయకుడు మండల రాహుల్, మహేందర్ పాల్గొన్నారు.
- Advertisement -