నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్‌లలో ఒకటైన ఇన్ఫినిటీ లెర్న్‌తో కలిసి శ్రీచైతన్య విద్యా సంస్థలు ఇన్ఫినిటీ వన్ పేరుతో ఆన్‌లైన్ ట్యూషన్ ప్రోగ్రాంను ప్రారంభించాయి. ఈ ప్రోగ్రాంలో భాగంగా 4 నుంచి 12వ తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రీమియం వ్యక్తిగతంగా 1:1 పద్ధతిలో ఆన్‌లైన్‌లో సీబీఎస్‌ఈ, ఫౌండేషన్, జేఈఈ, నీట్ విభాగాల్లో రూపొందించారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సీఈవో, డైరెక్టర్ సుష్మా బొప్పన మాట్లాడుతూ ఇన్ఫినిటీ వన్ ద్వారా అకడమిక్ కఠినత, వ్యక్తిగత మార్గదర్శకత్వం, నిరంతర ఫీడ్ బ్యాక్ ఒకటిగా కలుస్తాయని తెలిపారు. క్రమబ్ధమైన విద్య, వ్యక్తిగత మెంటారింగ్‌తో ప్రతి దశలో విద్యార్థులకు మద్దతు ఇచ్చి బలమైన పునాదులు నిర్మిస్తామని చెప్పారు. ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండింగ్ సీఈవో ఉజ్జ్వల్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థికి అర్థం కాని కాన్సెప్ట్, పరిష్కరించలేని సమస్య, పరీక్షల్లో మళ్లీ, మళ్లీ ఎదురయ్యే లోపం గుర్తించి స్పష్టత వచ్చే వరకు సహాయపడతామని తెలిపారు.
శ్రీచైతన్య ఇన్ఫినిటీ వన్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



