Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైభవంగా శ్రీ దత్త జయంతి మహోత్సవం

వైభవంగా శ్రీ దత్త జయంతి మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుకునే శ్రీ దత్తాత్రేయ జయంతిని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శివాజీ చౌరస్తా దగ్గర గుండం వద్ద గల శాంతి ఆశ్రమం లోని శ్రీ దత్తాత్రేయ స్వామికి  ప్రత్యేక పూజలు నిర్వహించి, శివునికి పంచామృతాలతో అభిషేకంతో పాటు హోమం చేశారు. సాయంత్రం వేళ శ్రీ దత్తాత్రేయుని బారసాల చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం క్షత్రియ సమాజ్ క్షత్రియ దాతల సహాయ సహకారాలతో భక్తులకు పెద్ద ఎత్తున గావ్ ను ఝమ్మాన్ ( ఊరి భోజనం), తీర్థప్రసాదాలు అందించారు.

వేల సంఖ్యలో వచ్చిన క్షత్రియులు దత్తాత్రేయుని జయంతి ఉత్సవంలో పాల్గొని దేవుని కృపకు పాత్రులయ్యారని అదేవిధంగా ప్రజలందరూ సుఖ శాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ప్రతి ఏటా శ్రీ దత్తాత్రేయ జయంతి నిర్వహిస్తామని సమాజ అధ్యక్షులు బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్, కార్యదర్శి బారడ్ గంగామోహన్, కన్వీనర్ షికారి శ్రీనివాస్, కో కన్వీనర్ డీకే శ్రీనివాస్ తెలిపారు.

అంగరంగ వైభవంగా జరిపించిన క్షత్రియ సమాజ్ కు పట్కరి కులస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్  అధ్యక్షుడు బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్, కార్యదర్శి బారడ్ గంగ మోహన్, కార్యక్రమ కన్వీనర్ షికారి శ్రీనివాస్, కో కన్వీనర్ డి కే శ్రీనివాస్, ప్రాంతీయ సమాజ్ కార్యనిర్వహణ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్, ప్రాంతీయ సమాజ్ కార్యదర్శి పడాల్ గణేష్, యువజన సమాజ్ అధ్యక్షుడు సాత్పుతే సంతోష్, యువన సమాజ్ కార్యదర్శి నీరజ్, క్షత్రియ సమాజ్ సభ్యులు సాత్ పుతే శ్రీనివాస్, భారడ్ బాలాజీ, పాన్ శ్రీనివాస్,జెస్సు ఆనంద్, జెస్సు శ్రీనివాస్,సంతాని విజయ్, సంతాని అశోక్, చౌల్ రాజ్ కుమార్, కర్తన్ గంగా మోహన్, రాజేందర్, పొహార్ శైలేష్, క్షత్రియ సమాజ్ సభ్యులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -