నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా శెట్టి పవన్ యాదవ్, గౌరవ అధ్యక్షులుగా పబ్బాల రమేష్ వంశరాజ్, ముఖ్య సలహాదారులుగా శెట్టి గోపాల్ యాదవ్, చుక్కల శంకర్ యాదవ్, ఉపాధ్యక్షులుగా కొసన మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా సుక్కల శ్రీశైలం యాదవ్, కార్యదర్శిగా శెట్టి అశోక్ యాదవ్ కోశాధికారిగా నోముల శ్రీశైలం యాదవ్, సహాయ కోశాధికారిగా మాటూరి శంకర్ గౌడ్, కోఆర్డినేటర్స్ గా కోట ఉపేందర్ మాదిగ, ఏశబోయిన శ్రీకాంత్ యాదవ్, ప్రచార కార్యదర్శిగా తోటకూరి వెంకటేష్ యాదవ్, లను యూత్ అసోసియేషన్ సభ్యులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శెట్టి పవన్ యాదవ్ మాట్లాడుతూ యూత్ సభ్యులు నాపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని యూత్ అభివృద్ధిలో సభ్యులందరూ భాగస్తులు కావాలని తెలియజేస్తూ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు యూత్ సభ్యులు పాల్గొన్నారు.