- Advertisement -
హైదరాబాద్ : శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో ఆధ్వర్యంలో శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో (ఎస్‌ఎల్‌సీబీ) మంగళవారం హైదరాబాద్‌లో రోడ్‌షో క్యాంపెయిన్‌ను నిర్వహించింది. సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలు (మైస్) ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి పర్యాటకులను మరింత ఆకర్షించాలని నిర్దేశించుకున్నట్లు చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హై కమిషన్‌లో యాక్టింగ్ డిప్యూటీ హైకమిషనర్ హర్ష రూపరత్నే తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి నుంచి మే 31 మధ్య 204,060 మంది భారతీయ సందర్శకులు శ్రీలంకకు వచ్చారన్నారు. తమ దేశాన్ని సందర్శించటానికి భారత ప్రయాణికులను స్వాగతిస్తున్నామన్నారు.
- Advertisement -