నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి గురువారం తెలిపారు. నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29, 30 తేదిలలో జిల్లా కేంద్రంలోని నాగారం రాజారాం స్టేడియంలో జరిగిన అండర్-16 షాట్ పుట్, లాంగ్ జంప్ పోటీలలో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు.
పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న తూమ్ సాయి చరణ్ అండర్-16 షాట్ పుట్, ఏడవ తరగతి చదువుతున్న బందెల సహర్య అండర్-12 లాంగ్ జంప్ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఆగస్ట్ 3, 4 తేదీలలో హన్మకొండ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించినట్లు కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు విఠల్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీ విద్యాసాయి విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES