Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రీధ హాస్పిటల్‌ సీజ్‌

శ్రీధ హాస్పిటల్‌ సీజ్‌

- Advertisement -

బినామీ పేరుతో రిజిస్ట్రేషన్‌.. యథేచ్ఛగా రన్నింగ్‌!
అనర్హులతో వైద్యం..
నవతెలంగాణ-పుల్కల్‌

సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండల కేంద్రంలోని శ్రీధ ప్రయివేటు ఆస్పత్రిని డీఎంహెచ్‌ఓ నాగ నిర్మల శుక్రవారం సీజ్‌ చేశారు. సదరు ఆస్పత్రి బినామీ పేరుతో రిజిస్ట్రేషన్‌ అయి.. మరో వ్యక్తితో నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, గత కొంతకాలంగా అర్హత లేని డాక్టర్లతో వైద్యం చేస్తుండగా పలువురు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. గూగుల్‌లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. అలాగే పలువురు ఇప్పటికే ఈ ఆస్పత్రిపై ఫిర్యాదు చేశారు. దాంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగ నిర్మల శుక్రవారం ఆకస్మికంగా ఈ ఆస్పత్రిలో తనిఖీ చేసి సీజ్‌ చేశారు. ఆమె వెంట జిల్లా అధికారులు, పుల్కల్‌ ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -