Monday, July 28, 2025
E-PAPER
Homeఆటలుక్రీడాశాఖ మంత్రిగా శ్రీహరి బాధ్యతలు

క్రీడాశాఖ మంత్రిగా శ్రీహరి బాధ్యతలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో క్రీడామంత్రిత్వ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) చైర్మెన్‌ కె. శివసేన రెడ్డి, వీసీ-ఎండీ సోనిబాల దేవి సహా తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి, టీఓఏ కోశాధికారి సతీశ్‌ గౌడ్‌ తదితరులు మంత్రి శ్రీహరికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -