Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeసినిమాబహు భాషల్లో 'శ్రీమద్‌ భాగవతం'

బహు భాషల్లో ‘శ్రీమద్‌ భాగవతం’

- Advertisement -

సాగర్‌ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఆకాష్‌ సాగర్‌ చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమద్‌ భాగవతం పార్ట్‌-1’. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి, నిర్మాత మోతీ సాగర్‌, సీహెచ్‌ కిరణ్‌ (చైర్మన్‌,ఎండి రామోజీ గ్రూప్‌), విజయేశ్వరి(ఎండి, రామోజీ ఫిల్మ్‌ సిటీ) తదితర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘తరం మారుతున్న ఈ సమయంలో ఇలాంటి సినిమాలు చాలా అవసరం’ అని అన్నారు. బహు భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad