Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు: రేవంత్‌రెడ్డి

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు: రేవంత్‌రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మంత్రి ఉత్తమ్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీటినిల్వ క్షేమం కాదని ఎన్డీఎస్‌ఏ చెప్పిందని, నీరు నిల్వ చేశాక మొత్తం కూలిపోతే గ్రామాలు కొట్టుకుపోతాయని సీఎం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -