న్యూఢిల్లీ: నెదర్లాండ్స్‌తో జరిగే డేవిస్ కప్ టై మ్యాచ్‌కు శ్రీరామ్ బాలాజీని తొలగించినట్టు ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ) గురువారం ప్రకటించింది. ఏఐటీఏ తొలుత బాలాజీ పేరును ప్రకటించగా.. తాజాగా ప్రకటనలో అతని పేరును తొలగిస్తున్నట్టు తెలిపింది. దీంతో పురుషుల డబుల్స్‌లో యూకీ బాంబ్రీ-రుత్విక్ బొల్లేపల్లి బరిలో దిగనున్నారు. నెదర్లాండ్స్‌తో తొలిరౌండ్ క్వాలిఫయర్స్ టై ఫిబ్రవరి 7న బెంగళూరు వేదికగా జరగనుంది. భారతజట్టుకు సారథ్యం వహిస్తున్న సుమిత్ నాగల్ సింగిల్స్ బరిలో దిగుతున్నాడు.
డబుల్స్ స్పెషలిస్ట్‌లు యూకీ బాంబ్రీతోపాటు దక్షిణేశ్వర్ సురేశ్, కరణ్ సింగ్ కూడా ఉన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే శ్రీరామ్ బాలాజీని తొలగించినట్లు ఏఐటీఏ తాజా ప్రకటనలో పేర్కొంది. ఈ విషయమై భారత కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలనే దృష్టితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నెదర్లాండ్స్‌తో టై కోసం ఎంపిక చేసిన జట్టులో రిజర్వు ఆటగాళ్లుగా ఆర్యన్ షా, ఎడమచేతి వాటం అనిరుధ్ చంద్రశేఖర్ మరియు దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు.
నెదర్లాండ్స్‌తో డేవిస్ కప్‌కు శ్రీరామ్ బాలాజీ తొలగింపు
- Advertisement -
- Advertisement -



