Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్టీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ కాశన్నను తక్షణమే సస్పెండ్ చేయాలి..

ఎస్టీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ కాశన్నను తక్షణమే సస్పెండ్ చేయాలి..

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి.సయ్యద్
నవతెలంగాణ – అచ్చంపేట
అమ్రాబాద్ మండల కేంద్రంలో గల ఎస్టి బాయ్స్ హాస్టల్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. పారిశుధ్యం లోపించింది. ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించారు విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్  మాట్లాడుతూ .. హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని,  త్రాగునీటి సౌకర్యం లేదన్నారు. వాటర్ ట్యాంక్ పై మూతలేకపోవడంతో నీటిలో కోతులు దూకడం తరుగుతుంది. 

అవే నీటిని విద్యార్థులు తాగుతున్నారని ఆరోపించారు. మరుగుదొడ్లు సరిగ్గా లేక విద్యార్థులు అనారోగ్య పాలు కావడం జరుగుతుంది.  గదులలో ఫ్యాన్లు సరిగా లేని పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి హాస్టల్లో సందర్శించాలని మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలన్నారు.  లేనియెడల విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు మరియు హాస్టల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -