Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నిలిచిపోయిన సీసీరోడ్డు పనులు పున: ప్రారంభం

నిలిచిపోయిన సీసీరోడ్డు పనులు పున: ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలో కొన్ని నెలల క్రితం సీసీరోడ్డు పనులు జరిగాయి. ఆ పనుల్లో నాసిరకం పనులు జరగడంతో తొలకరి వర్షాలకే సీసీ రోడ్డు కంకర తేలి నాసిరకంగా మారింది. ఈ రోడ్డు గురించి పత్రికల్లో వచ్చిన వార్తలకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు స్పందించారు. ఈ క్రమంలో సదరు గుత్తేదార్ కు బిల్లులు నిలిపివేయాలని అదికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 11న ఎమ్మెల్యే మద్నూర్ మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆగిపోయిన సీసీరోడ్డు పనులను పున: ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు. దీంతో మంగళవారం గుత్తేదార్ సీసీరోడ్డు పనులను మొదలుపెట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img