Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంపూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిస‌లాట‌..625 మందికి తీవ్ర గాయాలు

పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిస‌లాట‌..625 మందికి తీవ్ర గాయాలు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 625 మంది గాయపడ్డారు. స్థానిక మీడియా కథనం ప్రకారం చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలుఎక్కువ మంది ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారని వార్తలొస్తున్నాయి.

రథయాత్రను లాగుతున్న తాళ్లను పట్టుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఒకరిపై ఒకరు పడిపోయారని మీడియా పేర్కొంది. క్షతగాత్రులలో దాదాపు 70 మంది పూరి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన వారు స్థానిక ఆసుప్రతుల్లో చికిత్స తీసుకుంటున్నారు. బాలగండి ప్రాంతానికి సమీపంలో జరిగిన రథయాత్రలో అనేక మంది గాయపడ్డారని అధికార‌ వర్గాలు తెలిపాయి.

కాగా, ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్పందించారు. గాయపడిన వారికి చికిత్స అందించే విధంగా ఏర్పాట్ల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -