Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ

నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలోని మంత్రివర్గ సమావేశ మందిరంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా భవిష్యత్‌ అవసరాలకోసం నిర్మించనున్న థర్మల్‌, పునరుత్పాదక ఇంధన కేంద్రాలపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే రాష్ట్రంలో మరో కొత్త డిస్కం ఏర్పాటుపైనా అధికారులు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు. కొత్త డిస్కం ఏర్పాటు సాధ్యం కాదని ఇప్పటికే ఇంథనశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీన్ని సీఎం సహా మంత్రులకు వివరించనున్నారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు, ఏఏ వర్గాలకు ఎన్ని స్థానాలు ఎంపిక అయ్యాయనే విషయంపై కూడా మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో తెలంగాణ రైజింగ్‌ 2047 పై సమీక్ష సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. దానిలో కూడా మంత్రులు పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -