- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు సారాంశాన్ని త్రిసభ్య కమిటీ ప్రభుత్వం ముందు ఉంచనుంది. దానిపై చర్చించేందుకే మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై పోరు, కొత్త రేషన్ కార్డుల జారీ, యూరియా కొరత తదితరాంశాలపై చర్చించే అవకాశముంది. అయితే కాళేశ్వరమే ప్రధాన ఎజెండా అని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
- Advertisement -