- అరెస్టులకు వ్యతిరేకంగా సిఐటియు ఆందోళన
నవతెలంగాణ-కంఠేశ్వర్: కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే అక్రమ అరెస్టులు చేస్తారా అని ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో అధికారులకు, సిఐటియు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడి సమస్యలను చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పిపిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తమ సమస్యలు తెలియజేదామని ముందుకు వెళ్తే.. మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి మండలాలలో పీఎస్ ల్లో నిర్భందించడం అన్యాయమన్నారు. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అంగన్వాడీలకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎన్నికల హామీని ఇప్పటివరకు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు కొద్దిరోజులుగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను అంగన్వాడిలకు అప్పగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని మండిపడ్డారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఐదు సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు.
విద్యా బోధనా బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇవ్వాలన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకం కాదని, ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకు బోధించే బాధ్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, అబ్దుల్ ముజీబ్, కృష్ణ విట్టల్, మల్లేష్, శంకర్, ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ అలీ, మొహమ్మద్ షకీల్, తదితరులు పాల్గొన్నారు.

