మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవతో హుజూర్నగర్ లో మెగా జాబ్ మేళా
పాల్గొననున్న 200 పై చిలుకు కంపెనీలు
నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ సర్కార్ సంకల్పమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోనీ పేర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈనెల 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.మెగా జాబ్ మేళాలో పాల్గొనేందుకు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు వద్ద బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ మేళాలో 200పై చిలుకు కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఉపాధి కోసం నిరీక్షిస్తున్న నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నిరుద్యోగ నిర్ములనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES