నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై భువనేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలను నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. రాబోయే తరాలు తెలంగాణ అవతరణ దినోత్సవం, తెలంగాణ ఏర్పాటుకు ఎన్ని అవరోధాలు వచ్చాయో తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పటి యువతపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమాన్నా ప్రత్యక్ష్యంగా మనమంతా చూశామని, ఎందరో త్యాగ ఫలాల ఫలితమే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. అందుకే మేమంతా అవతరణ దినోత్సవం వేడుకలను నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు తెలంగాణ వాదులకు, అందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు ఏఎస్ఐ వెంకట్రావు, కానిస్టేబుల్స్ శ్రీకాంత్ , దత్తు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్లో రాష్ర్ట అవతరణ వేడుకలు..
- Advertisement -
- Advertisement -



