వర్ధన్నపేట ఏసీపి నర్సయ్య
నవతెలంగాణ-పాలకుర్తి
గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టామని వర్ధన్నపేట ఏసిపి అంబటి నర్సయ్య తెలిపారు. సోమవారం మండలంలోని పలు గ్రామాలను పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్ తో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను సరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ప్రశాంతమైన వాతావరణం లో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని సూచించారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రజలు పోలీసులకు, ఎన్నికల అధికారులకు సహకరించాలన్నారు. ఎలాంటి గొడవలకు పాల్పడిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



