- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. దీంతో సెన్సెక్స్ 500 పాయింట్ల మేర పతనం కాగా.. నిఫ్టీ కీలకమైన 25వేల స్థాయిని కోల్పోయింది. ఇంట్రాడే 650 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ఓ దశలో 81,608.13 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకి 501.51 పాయింట్ల నష్టంతో 81,757.73 వద్ద ముగిసింది. నిఫ్టీ 143.05 పాయింట్ల నష్టంతో 24,968.40 వద్ద స్థిరపడింది.
- Advertisement -