నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ ఒడుదుడుకులు ఎదుర్కొంటోంది. నిన్న ఇరాన్‌తో అమెరికాకు కాల్పుల విరమణ జరగడంతో మార్కెట్ భారీగా పుంజుకుంది. అయితే గంటల వ్యవధిలోనే మళ్లీ పరిస్థితులు దిగజారిపోయాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడం.. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అంతేకాకుండా శాంతి చర్చలపై కూడా ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో గురువారం మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. నిన్న భారీ లాభాలు అర్జించగా.. అంతలోనే ఆశలు ఆవిరైపోయాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 249 పాయింట్లు నష్టపోయి 77, 313 దగ్గర కొనసాగుతుండగా… నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 23, 944 దగ్గర కొనసాగుతోంది.
భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
- Advertisement -
- Advertisement -



