Tuesday, December 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి శ్రీధర్‌బాబుపై ఆరోపణలు మానుకో

మంత్రి శ్రీధర్‌బాబుపై ఆరోపణలు మానుకో

- Advertisement -

– టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్‌ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఓ పాపాల పుట్ట అని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ కొనగాల మహేష్‌ విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబుపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు. మచ్చలేని కాంగ్రెస్‌ నేత, మంత్రి శ్రీధర్‌బాబుపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమకు శ్రీధర్‌బాబు నేర్పించిన సంస్కారం అడ్డొస్తుందనీ, హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని మధును ఆయన హెచ్చరించారు. రైజింగ్‌ తెలంగాణ పేరుతో, సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు రెండేండ్లలో లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తూ…యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు వస్తున్న మంచి పేరును జీర్ణించుకోలేక మంత్రిపై ఆయన అసత్య ప్రచారాలతో విషం చిమ్ముతున్నారని విమర్శించారు. అక్రమ సంపాదనతో, వేలకోట్లు పోగేసుకునే ధ్యాస తప్ప ప్రజలకు ఎన్నడూ ఆయన సేవ చేయలేదని విమర్శించారు. నిస్వార్ధంగా, నిజాయితీగా, అవినీతికి దూరంలో రాజకీయాలు చేస్తూ, అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న మంత్రి శ్రీధర్‌బాబుపై ఇంకోసారి అసత్య ఆరోపణలు చేసేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -