నవతెలంగాణ-హైదరాబాద్: వేదిక ఏదైనా..సందర్భంతో పనిలేకుండా సెల్ప్ డబ్బ కొట్టడంలో ట్రంప్‌కు ఎవరూ సాటిరారు అని మరోసారి రుజువు అయింది. ఐదేళ్ల నెలల్లో ప్రపంచంలోని పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో పాటు ఐదు యుద్దాలు ఆపానని, అందులో పాక్-ఇండియా యుద్ధానికి ముగింపునకు కృషి చేశానని ప్రగల్భాలు పలికారు. 2028 ఏడాది సంబంధించి ఒలింపిక్స్ గేమ్స్ లాస్ ఏంజిల్స్ వేదికగా జరగున్నాయి. ఈ సందర్భంగా వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని 20 రోజుల్లోనే ట్రంప్ తన వాదనను పునరావృతం చేశారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను మోడీ ఖండించాలని, కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ జోక్యంలేదని ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.