Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్పునుంతలలో తుఫాన్ బీభత్సం

ఉప్పునుంతలలో తుఫాన్ బీభత్సం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల: ఉప్పునుంతల మండలంలో మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన అధిక వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చే పంటలు నీళ్లలో కలిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని, ఎకరాకు రూ.30,000 చొప్పున నష్టపరిహారం అందజేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు డిమాండ్ చేశారు. రెవిన్యూ, వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతుల పొలాలను వెంటనే సందర్శించి పంటనష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని కోరారు. పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ సంవత్సరం జూలై నుండి ఎడతెరిపి లేని వర్షాల వల్ల రైతులు అప్పులు తెచ్చి వేసిన పంటలు పాడై, ఆర్థికంగా కుంగిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు భరోసా ఇవ్వాలని, నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందజేయాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొడుగు చంద్రయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -