– సీడబ్ల్యూసీ అనుమతి లేకుండానే కాళేశ్వరం కట్టారు
– పీసీ ఘోష్ కమిషన్ విచారణలో తేలింది ఇదే
– రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిన అంచనా
– విద్యుత్ బకాయిలు రూ.9,735 కోట్లు
– డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేదు
– సిగ్గులేకుండా కోర్టుకెళ్లారు
– అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
– సభ్యుల సూచన మేరకే చర్యలంటూ వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టుకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అన్నీ కేసీఆరేనని, న్యాయవిచారణ కమిషన్ తేల్చిందిదేనని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖమంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. సీఎం హోదాలో కేసీఆర్ ఇంజినీర్‌లా వ్యవహరించి సాంకేతిక అంశాల్లో జోక్యం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ రిపోర్టుపై ఆదివారం స్పీకర్ బి.ప్రసాద్‌కుమార్ అసెంబ్లీలో చర్చకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్, కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియా అన్నీ కేసీఆరే, మేడిగడ్డ అయన వ్యక్తిగత నిర్ణయమన్నారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రారంభించినట్టు కమిషన్ నివేదికలో పేర్కొంద న్నారు. ”ఉద్దేశ్యపూర్వకంగానే కాళేశ్వరం నిర్మించారని కమిషన్ నివేదిక ఇచ్చింది. మూడు ప్రాజెక్టుల్లో సరైన నిర్వహణ లేదు. నిర్లక్ష్యంగా, అక్రమంగా, అసంబద్ధంగా ప్రాజెక్టు కట్టారని కమిషన్ చెప్పింది.
ప్లానింగ్, డిజైన్లలోనే కాదు, నిర్వహణలోనూ విఫలమైంది. తీవ్రమైన లోపాలు న్నాయి. కేసీఆర్ నియమించిన రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను సైతం బేఖాతరు చేశారు. తొందరపాటు ఆమో దాలతో ప్రాజెక్టుకు నష్టాలు తెచ్చారు. కేసీఆర్ చెప్పినట్టే చేశామని అధికారులు వాం గ్మూలం ఇచ్చారు. నిబంధనల ను ఉల్లంఘించి కాంట్రాక్టర్లకు మేలు చేశారు. అనుమతులు రాకుండానే పనులు అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్య లకు పాల్పడట్లేదు. ప్రాజెక్టుల్లో రాజకీయ జోక్యం, నిర్లక్ష్యం ఉంది. మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్మాణాలకు బడ్జెట్ విడు దల చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కాళే శ్వరం ప్రాజెక్టుకు పెరిగిన ఖర్చు వల్ల రాష్ట్ర ప్రభు త్వానికి ఆర్థికంగా భారీ నష్టం జరిగింద’న్నారు. రూ. 38,400 కోట్లతో ప్రాణహితను చేపడితే, కాళేశ్వ రాన్ని రూ.1.47 లక్షల కోట్లకు పెంచారని చెప్పారు. బీఆర్‌ఎస్ హ యాంలోనే రాష్ట్రానికి పూర్తి నష్టం జరిగిందన్నారు. కాళే శ్వరం అక్రమాలకు పూర్తిబాధ్యత కేసీఆర్‌దేనని కమిషన్ తేల్చింద న్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచిం చిందని వెల్లడించారు. కేసీఆర్‌పై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకునే స్వేచ్ఛ సర్కార్‌కు ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
తేడా లేదు
డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేకుండా ప్రాజెక్టు పనులు చేశారని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో ఉందని మంత్రి విమర్శించారు. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలి పోయేందుకు కారణమ య్యారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ. 87,449 కోట్లతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిరుపయోగంగా మారాయని, ప్రాణహిత- చేవెళ్లను పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. మూడు బ్యారేజీలు 20 నెలలుగా నిరుపయోగంగా మారాయని వెల్లడించారు. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్లను అప్పటి సీఎం మార్చారని కమిషన్ చెప్పిందని వివరించారు. మేడిగడ్డలో బ్యారేజీ నిర్మించవద్దని వ్యాప్కోస్ నిపుణులు చెప్పినా వినకపోవడం వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయన్నారు. రూ. 38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి రూ. 1.47 లక్షల కోట్లతో కాళేశ్వరం చేపట్టి రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. 2019 నుంచి 2023 వరకు లిఫ్ట్ చేసిన నీళ్లు 162 టీఎంసీలు మాత్రమేనని వివరించారు.
లిఫ్ట్ చేసినవి 20.2 టీఎంసీలే..
కాళేశ్వరం నుంచి ఏడాదికి 20.2 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారనీ, బ్యారేజీలకు జరిగిన నష్టం రాష్ట్రానికి పెనుభారంగా మారిందని మంత్రి తెలిపారు. రూ. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేకపోవడం తీవ్ర నష్టమేనన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు ఉన్నాయని కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖ రాసినా కేసీఆర్, హరీశ్‌రావు పట్టించుకోలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఇలాంటి విపత్తు ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టుపై బీఆర్‌ఎస్ నేతలు ఇష్టమెచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బిల్లు తెచ్చినప్పుడు బీఆర్‌ఎస్ మద్దతిచ్చిందని ఉత్తమ్‌కుమార్ వివరించారు.
సాంకేతికాంశాల్లో జోక్యం
అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం పనులను కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణకు ఇది చాలా బాధాకరమైన రోజు అని అభిప్రాయపడ్డారు. ప్రాణహిత – చేవెళ్ల కట్టాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ప్రాణహిత – చేవెళ్లపై 2014 నాటికే రూ.11,600 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు సరికాదని నాటి ప్రభుత్వ కమిటీ చెప్పిందని వివ రించారు. వాప్కోస్ రిపోర్టు రావడానికి ముందే మేడిగడ్డ బ్యారేజ్ ను కట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసు కుందనీ, సాంకేతిక అంశాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు.
క్యాబినెట్ అనుమతి లేదు
క్యాబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభు త్వం ముందుకు వెళ్లిం దని మంత్రి చెప్పుకొ చ్చారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 47 వేల కోట్లు ఖర్చయ్యాయని, అయినా కట్టిన నాలుగు ఏండ్లలోనే కూలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచే ఈ ప్రాజెక్టులో లోపాలు బయట పడ్డాయని క్లారిటీ ఇచ్చారు. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయొద్దని అధికారులు చెప్పినా బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు వినలేదనీ, దాని ఫలితంగానే మేడిగడ్డ బ్యారేజ్ కూలిందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల విద్యుత్ ఖర్చుల కోసం రూ. 9,735 కోట్ల బకాయిలు ప్రభుత్వం ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉందన్నారు.
ఆంగ్లం, తెలుగులో కమిషన్ సారాంశం
అసెంబ్లీలో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాల కాపీలను ఆంగ్లం, తెలుగులో సభకు సమర్పించారు. ముందు సభలో నివేదికను టేబుల్ చేసినప్పుడు సభ్యులకు పెన్‌డ్రైవ్‌లో పూర్తి వివరాలు అందజేశారు. సాయంత్రం 4.30 గంటలకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ చర్చకు అనుమతించారు. 38 పేజీలతో కాళేశ్వరం నివేదిక తెలుగు సారాంశం, 25 పేజీల్లో ఇంగ్లీషు సా రాంశం కాపీలను సభకు మళ్లీ అందించారు. గ్యాలరీలో మీడియాకు కూడా అవే ఇచ్చారు.
వాగ్వివాదం
సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశాన్ని సభకు వివరిస్తుండగానే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఉత్తమ్ ప్రసంగాన్నీ పదే పదే హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావులను తప్పుబట్టిన అంశాలను మంత్రి సభలో ప్రస్తావిస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు ‘షేమ్ షేమ్’ అని అరిచారు. స్పీకర్ పలుమార్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్‌బాబు సైతం హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ సభ్యుల వైఖరిని తప్పుబట్టారు. మొత్తం 119 శాసనసభ్యులకుగాను చర్చ ప్రారంభమైనప్పుడు 25 మంది ఎమ్మెల్యేలు సభలో ఉండగా, క్రమంగా 40కి పెరిగారు.
మంత్రి ఉత్తమ్ ప్రసంగంలోని కీలకాంశాలివే
– కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేల కోట్లు అవసరం.
– అక్టోబర్ 21, 2023న కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే మేడిగడ్డ ఆరు పిల్లర్లు కుంగాయి.
– కాళేశ్వరం ద్వారా ఐదేండ్లలో 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. అందులో 30 టీఎంసీలు మళ్లీ సముద్రంలోకి వదిలేశారు.
– రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుతో ఐదేండ్లలో 101 టీఎంసీలు మాత్రమే ఉపయోగం
– ఏడాదికి సగటున 20 టీఎంసీలు మాత్రమే ఉపయోగపడ్డాయి.
– లక్ష కోట్లు ఖర్చుపెట్టినా కొత్తగా రెండు లక్షల ఎకరాలకు కూడా నీరివ్వలేదు. పైగా ప్రాజెక్టు ఆరేండ్లలోనే కూలిపోయింది.
– బ్యారేజీ కట్టి డ్యామ్‌లా వినియోగించి స్టోరేజీ చేయడం వల్లే మేడిగడ్డ కూలింది.
– అధికారులు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
– ప్రజా ప్రభుత్వం కాళేశ్వరం వినియోగించకపోయినా రికార్డుస్థాయి పంట పండింది.
– నిర్మాణం, నాణ్యతా లోపాలున్నాయని కమిషన్ చెప్పింది.
– కాళేశ్వరంపై మాకు కక్ష సాధింపు లేదు. బీఆర్‌ఎస్ వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం వాటిల్లింది.
– మూడు బ్యారేజీలను పీసీ ఘోష్ కమిషన్ పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసింది.
– కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను కమిషన్ ప్రశ్నించింది.
– రాష్ట్రానికి ఇంత నష్టంచేసి, పీసీ ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ కమిషన్ అంటూ విమర్శించారు.
– కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని కోర్టుకు కూడా వెళ్లారు.
– కాళేశ్వరం తప్పిదాలకు కేసీఆర్‌దే పూర్తి బాధ్యత అని కమిషన్ తేల్చింది.
– అనుమతులు రాకముందే పనులు ప్రారంభించి, కాంట్రాక్లర్లకు పనులు అప్పగించారు.
– తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవనే వాదన అబద్ధం.
– కాళేశ్వరం తప్పిదాలపై అందరి సూచనల మేరకే చర్యలుంటాయి.
కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అన్నీ కేసీఆరే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES