Monday, December 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవ్యూహాత్మక భాగస్వామ్యం

వ్యూహాత్మక భాగస్వామ్యం

- Advertisement -

ప్రకటించిన వెనిజులా, టర్కీ
కారకాస్‌ :
అమెరికా బెదిరింపుల నేపథ్యంలో వెనిజులా, టర్కీలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. 2026లో వెనిజులా-టర్కీ జాయింట్‌ కమిషన్‌ సమావేశం సందర్భంగా వెనిజులాను సందర్శించాలని అధ్యక్షుడు ఎర్డోగన్‌కు అధికారిక ఆహ్వానం పంపారు. వెనిజులా అధ్యక్షుడు మదురో ఆదివారం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కరేబియన్‌ తీరంలో సైనిక మోహరింపు, శాంతి, వెనిజులా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా చేపట్టిన చర్యలపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టం, ప్రజల స్వీయ నిర్ణయాధికారానికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని పునరుద్ఘాటించారు.యుద్దోన్మాద ప్రకటనలు, సైనిక ఆదేశాలతో సహా అమెరికా ఇటీవలి బెదిరింపులు చట్టవిరుద్ధమైనవి, అసమానవమైనవి, అనవసరసమైనవి , మితిమీరినవని మదురో పేర్కొన్నారు. బాహ్య ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యంగా క్రిస్మస్‌ సీజన్‌లో తమ దేశం రాజకీయ స్థిరత్వం, స్థిరమైన ఆర్థిక వ ృద్ధి, వరుసగా 18 త్రైమాసికాల విస్తరణ , జాతీయ ఐక్యత వాతావరణంతో మందుకు వెళుతోందని మదురో హామీ ఇచ్చారు. ఇటీవల టర్కీ, వెనిజులాలో జరిగిన ఉత్సవాల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్క ృతిక, సోదరసంబంధాలను పెంచాయని అన్నారు. స్వల్పకాలంలో వాణిజ్యాన్ని మూడు బిలియన్‌ డాలర్లకు పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు పర్యాటకులు, వ్యాపారవేత్తలు , పెట్టుబడిదారుల ప్రవాహానికి కీలకమైన టర్కీ ఎయిర్‌లైన్స్‌ నిర్వహించే ప్రత్యక్ష కారకాస్‌- ఇస్తాంబుల్‌ ఎయిర్‌ కనెక్షన్‌ను వెంటనే పున:స్థాపించనున్నామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -