తెగిపోయిన కుడి చెవి
జీహెచ్‌ఎంసీ అధికారులపై కార్పొరేటర్ ఆగ్రహం
నవతెలంగాణ -హయత్‌నగర్
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ శివగంగ కాలనీలో మంగళవారం దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఒక మూగ బాలుడిపై వీధికుక్కలు తీవ్రంగా దాడి చేసి గాయపర్చాయి. ఈ దాడిలో బాలుడి కుడి చెవి పూర్తిగా తెగిపోవడంతోపాటు తల, నడుము, వీపు భాగాల్లో లోతైన గాయాలు ఏర్పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ దంపతులు మూడేండ్ల కిందట నగరానికి వలస వచ్చారు. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు ప్రేమ్‌చంద్ పుట్టుకతోనే మూగవాడు. మంగళవారం తండ్రి మేస్త్రి పనికోసం వెళ్లాడు.
తల్లి ఇంట్లో పని చేసుకుంటుండగా బాలుడు ఆడుకోవడానికి బయటకు రావడంతో ఒక్కసారిగా సుమారు 10 వీధి కుక్కలు దాడి చేశాయి. అతని తల, నడుము, కుడి చెవి, వీపు భాగాలను కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాలుడిని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం నీలోఫర్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మన్సూరాబాద్ డివిజన్‌లో వీధి కుక్కల బెడద ఉందని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ప్రజల ప్రాణాలంటే వారికి లెక్కలేదని అన్నారు.
మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



