నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం ఛిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. రామారావుపల్లి ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఛిల్డ్రన్ పార్క్ ను నిర్మించడం ద్వారా పిల్లల వినోదం,అబ్యాసనం పొందుతున్నట్లుగా తెలిపారు. పార్క్ తో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో అభ్యసించడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని,భవిష్యత్తులో పిల్లల ,యొక్క నమోదును పెంచడం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉంటున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు,గ్రామస్తులు గమనించి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు.
చిల్డ్రన్ పార్క్ ల ఏర్పాటుతో పాఠశాలలు బలోపేతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


