- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ : బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై భార్గవ్ గౌడ్ స్పష్టం చేశారు. బొల్లారం శివారులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న పలువురిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకొని పలు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల రోడ్డుపై వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. మద్యం సేవించిన తర్వాత డ్రైవింగ్ చేస్తున్నారని, తద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
- Advertisement -