Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

- Advertisement -

– రాయపర్తి ఎస్ఐ ముత్యం రాజేందర్
– కొత్తూరులో ఏడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
నవతెలంగాణ – రాయపర్తి
ప్రభుత్వ ఆనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణా చేసినా, డంపింగ్‌ చేసినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ ముత్యం రాజేందర్ అన్నారు. మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో గత మంగళవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఏడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలుపుతూ.. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలకు విరుద్దంగా ఇసుక తరలింపు, విక్రయం చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.

మండలంలోని ఇసుక లభించే పరివాహక ప్రాంతాల్లో దృష్టి సారించినట్లు ఉపోద్ఘాటించారు. అక్రమ రవాణా చేసే వారిపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ డ్యామేజ్‌ టు పబ్లిక్‌ ప్రాపర్టీ (పీడీపీపీ) చట్టం, మైన్‌ అండ్‌ మినరల్స్‌ చట్టం ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు ఉన్నవారికి మాత్రమే ఇసుక రవాణా చేయడానికి, విక్రయించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇతరులెవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా గురించి తెలిసిన ప్రజలు డయల్‌ 100కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య, కానిస్టేబుల్స్ గణేష్, సుమన్, సంపత్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad