అక్రమంగా తరలిస్తున్న 10 మట్టి త్రవ్వే యంత్రాలు, వాహనాలు సీజ్
మట్టి రవాణా చేసే వారి పై కేసులు నమోదు చేసిన వేములవాడ ఆర్డిఓ
నవతెలంగాణ – సిరిసిల్ల
జిల్లాలో అక్రమ మట్టి మరియు ఇసుక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం తెలిపారు. వేములవాడ రూరల్ మండలంలోని కొడి ముంజ అనుపురం గ్రామ పరిసరాల్లో అక్రమ రవాణా చేస్తున్న 10 మట్టి త్రవ్వే యంత్రాలు, వాహనాలను వేములవాడ ఇంచార్జి ఆర్డిఓ రాధాబాయి ఆదివారం సాయంత్రం సీజ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్లకు అని బ్యానర్ తో అక్రమంగా తరలిస్తున్న మట్టి 4 టిప్పర్లు 2 ట్రాక్టర్లు 2 జెసిబి లు 2 హిటాచి యంత్రాలను వేములవాడ ఆర్డిఓ రాధాభాయి సీజ్ చేసి వారి పై కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఎవరు అనుమతి లేకుండా అక్రమ మట్టి , ఇసుక రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
అక్రమమట్టి.. ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES