Thursday, December 4, 2025
E-PAPER
Homeనిజామాబాద్ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు..

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు..

- Advertisement -
  • ఇందల్వాయి చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

నవతెలంగాణ-డిచ్‌పల్లి: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా సరిహద్దు లోని ఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడతూ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, నగదు, మద్యం మరియ అనుమానస్పద వ్యక్తులను తనిఖీలను కఠినంగా నిర్వహించాలని సూచించారు.
ప్రజలు స్వేచ్ఛగా, భయభ్రాంతులకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించూ కునేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ సందర్భంగా ఎస్.ఎస్ టీమ్ ఇంచార్జీ సాయి కుమార్, రవీంధర్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -