నిర్వాహకులను హెచ్చరించిన రూరల్ ఎస్‌ఐ అంజయ్య..
నవతెలంగాణ వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండల పరిధిలోని డీజే యజమానులతో బుధవారం రూరల్ ఎస్‌ఐ అంజయ్య సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్సై అంజయ్య మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు నిర్వహించడం, యాంప్లిఫైయర్ బాక్స్‌లు ఏర్పాటు చేయడం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గణేష్ మండపాల వద్ద కానీ, శోభాయాత్రలలో కానీ పెద్ద శబ్దాలతో డీజేలు ఉపయోగించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు.పోలీస్ శాఖ అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, అవి కూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించుకోవచ్చని సూచించారు. అధిక శబ్దాలు వలన చిన్నపిల్లల చదువుకు, వృద్ధుల ఆరోగ్యానికి ఆటంకం కలుగుతుందని తెలిపారు.
వినాయక చవితిని ప్రజలు భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్‌ఐ అంజయ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీజే నిర్వాహకులు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.