– రాయపోల్ ఎస్ఐ కుంచం మానస..
నవతెలంగాణ- రాయపోల్
గ్రామాలలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయించినట్లయితే చట్టపరంగా ఘటన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస హెచ్చరించారు. శనివారం రాయపోల్ మండలం ఆరేపల్లి, వడ్డేపల్లి , రామారం గ్రామాలలో పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా ఆరేపల్లి గ్రామానికి చెందిన దుర్గం గౌరేశ్ , వడ్డేపల్లి గ్రామస్థులు నర్సాగౌడ్, ఆంజనేయులు , రామారం గ్రామస్తురాలు లక్ష్మి వారి హోటళ్లలో అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తుండగా వారి వద్ద నుండి సుమారు 16 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వారి పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే ఎవరైనా బెల్ట్ షాపు నిర్వహించి అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పమన్నారు.
గ్రామాలలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



