- Advertisement -
బాల్కొండ ఎస్ఐ శైలేందర్
నవతెలంగాణ – బాల్కొండ
నిషేధిత మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మంగళవారం మండల కేంద్రంలోని గాలిపటాలు, మాంజా విక్రయ దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిషేధిత మాంజాలు వాడటం వల్ల వాహనదారుల ప్రాణాలకు హాని కలుగుతుందని తెలిపారు. ఎవరైనా నిషేధిత మాంజలు విక్రయిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
- Advertisement -



