– గ్రామాలలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు
– దుబ్బాక సిఐ పాలేపు శ్రీనివాస్
నవతెలంగాణ-మిరుదొడ్డి
అక్బరుపేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, జంగపల్లి, గాజులపల్లి, అల్మాసిపూర్ గ్రామాల పొలిమేరలలో ఉన్న బండ మల్లన్న స్వామి ఆలయంలో ఈ నెల 15న గురువారం జరగనున్న జాతరపై శనివారం గ్రామ పెద్దలతో సమావేశం జరిగింది. దుబ్బాక సిఐ శ్రీనివాస్, భూంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్ పాల్గొని, జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.అలాగే గ్రామాలలో ఎవరైనా మద్యం విక్రయించినట్లయితే వారిపై కేసులు చేసి రిమాండ్ కి పంపిస్తాం అని తెలిపారు. భక్తులు ప్రశాంతంగా జాతర వేడుకలు జరుపుకోవాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాల సర్పంచ్ లు,ఉపసర్పంచ్ లు,మెంబర్లు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



