Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శిశువు విక్రయాలు జరిపితే చట్టపరంగా కఠినమైన చర్యలు

శిశువు విక్రయాలు జరిపితే చట్టపరంగా కఠినమైన చర్యలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
శిశువు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ సూపర్ వైజర్ వెంకాయమ్మ  అన్నారు. మహిళ శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి ఆదేశాల ప్రకారం మంగళవారం మండల కేంద్రం లోనికస్తూరిభాగాంధీ పాఠశాల లో విద్యార్థినులకు, అంగన్వాడీ టీచర్లకు బాల్య వివాహాలు, అక్రమ దత్తత, శుషు విక్రయాల గురించి నిర్వహించిన సమావేశంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ.. ఆడబిడ్డను కాపాడుకోవడంలో భాగంగా  శిశువిక్రయాలు, బాల్య వివాహాలు, ఫోక్సో చట్టం,బాలికలపై  లైంగిక దాడుల వంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుదని తెలిపారు.

శిశు విక్రయాలు జరగకుండా, అలాగే బాల్య వివాహాలు, హాస్టల్ విద్యార్థులపై లైంగిక దాడులు వంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎక్కడైనా  శిశు విక్రయాలు జరిగితే అంగన్వాడీ టీచర్లు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఇటీవల శిశువిక్రయాలు , బాల్య విద్యార్థులపై లైంగిక దాడులు, బాల్యవివాహాలు, తదితర సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. బిడ్డలను కన్న ఏ తల్లి దండ్రులు శిశువులను అమ్మడం ,దత్తత ఇవ్వడం వంటివి చేయకుండా ఉండాలని కోరారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టాలు కఠినంగా ఉంటాయన్న విషయం మర్చిపోవద్దని తెలిపారు. ఆడపిల్లల కోసం ప్రత్యేకించి బేటి బచావో, బేటి పడావో  వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోకేజిబివి  ప్రిన్సిపాల్ – జోష్న,సూపర్ వైజర్లు శశికళ,అంగన్వాడీ టీచర్లు వసుందర,పుష్ప,ఎల్లమ్మ,విజయలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -