Tuesday, December 9, 2025
E-PAPER
Homeజాతీయంక‌ఠిన నిబంధ‌న‌లు వ్య‌వ‌స్థ‌లో మార్పు కోస‌మే: ప్ర‌ధాని మోడీ

క‌ఠిన నిబంధ‌న‌లు వ్య‌వ‌స్థ‌లో మార్పు కోస‌మే: ప్ర‌ధాని మోడీ

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇండిగో సంస్థ‌ గుత్తాధిప‌త్యం చెలాయించ‌డంతో విమాన సేవ‌ల్లో అంత‌రాయం నెలకొన్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా విమాన ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఆయా ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణీకులు ఆందోళ‌న చేప‌ట్టారు. అయితే ఇండిగో ఎయిర్ లైన్స్ స‌ర్వీసుల్లో నెల‌కొన్న సంక్షోభంపై తొలిసారి ప్ర‌ధాని మోడీ స్పందించారు. డీజీసీఏ నిబంధనలు వ్యవస్థను మెరుగుపరచడానికే గానీ.. ప్రజలను వేధించడానికి కాదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.మంగళవారం ఉదయం ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండిగో సంక్షోభంపై స్పందించారు. నియమాలు, నిబంధనలు వ్యవస్థను మెరుగుపరిచేలా చూసుకోవాలని.. అంతేకాని భారతీయ పౌరులను ఇబ్బందులకు గురి చేయడానికి కాదన్నారు. వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని ప్రధాని మోడీ చెప్పినట్లుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు. ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ ఇండిగో సంక్షోభం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -