Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeసినిమాబలమైన కథలూ విజయాలకు కారణం: నాగార్జున

బలమైన కథలూ విజయాలకు కారణం: నాగార్జున

- Advertisement -

‘పుష్ప’ సిరీస్‌ సినిమాలు తెలుగులో కంటే వేరే భాషల్లోనే కలెక్షన్లును ఎక్కువగా కలెక్ట్‌ చేశాయి. వందలో తొంభై మంది తమ ఒత్తిడిని పోగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్‌ని చూసేందుకు ఇష్టపడుతుంటారు. నేటి తరం ప్రేక్షకులు హీరోలను పుష్పరాజ్‌, రాకీ (కేజీఎఫ్‌), బాహుబలిలాంటి లార్జర్‌ దేన్‌ లైఫ్‌ రోల్స్‌లో చూడాలనుకుంటున్నారు. నేనూ అదే ఇష్టపడతాను’ అని హీరో నాగార్జున అన్నారు. వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌)లో ఆయన నాగ్‌ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టాల్‌’ను ఆవిష్కరించారు. అనంతరం కార్తి, ఖుష్బూ, అనుపమ్‌ఖేర్‌తో కలిసి ‘పాన్‌ ఇండియా సినిమా’ పై నాగార్జున మాట్లాడారు. ‘కేవలం హీరోల ఎలివేషనే కాదు. బలమైన కథలతోనే ‘పుష్ప’, ‘కేజీఎఫ్‌’, ‘బాహుబలి’లాంటి సినిమాలు విజయాలు సాధించాయి. రాజమౌళి ‘బాహుబలి’ని తెలుగులోనే తెరకెక్కించినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు దాన్ని ఆదరించారు’ అని నాగార్జున అన్నారు. అమీర్‌ఖాన్‌, కరీనాకపూర్‌, విజరుదేవరకొండ తదితరులు కూడా ఈ వేడుకలో హాజరై, సందడి చేశారు. గురువారం ప్రారంభమైన ‘వేవ్స్‌’ సమ్మిట్‌ ఆదివారం వరకు కొనసాగనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad