ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో ఎస్ టి ఎస్ ఎం హెచ్ హాస్టల్ మంజూరు చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలు అధ్యక్షతన బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామర కిరణ్ హాజరై మాట్లాడుతూ బాయ్స్ ఎస్టి ఎస్ఎంఎస్ హాస్టల్ మండల కేంద్రంలో మంజూరు చేయాలని అన్నారు మేడారం, నార్లాపూర్, కొడిశాల ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు జూనియర్ కళాశాలకు చదువుకోటానికి వస్తున్నారని అన్నారు.
బాయ్స్ కళాశాల హాస్టల్ లేక విద్యార్థులు మార్గమధ్యలోనే ఆగిపోయి చదువులకు దూరమయ్యే విధంగా పరిస్థితి వుంది అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల కు కళాశాల హాస్టల్ మంజూరు చేయాలని కిరణ్ డిమాండ్ చేశారు అదేవిధంగా గత 8,9 నెలల నుంచి సంక్షేమ హాస్టల్లోనే పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలు విడుదల కాక వార్డెన్లు బ్యాంకులో సైతం చైన్లు అప్పు పెడుతూ హాస్టల్లు నడిపిస్తున్నారు పెండింగ్లో ఉన్న బిల్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయి లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, మరుగుదొడ్లు తరగతి గదుల ఫ్యాన్లు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ఎల్ రవి,కాలేజి కమిటీ నాయకులు చరణ్, మహేశ్వర్ ,రోహిత్, మానస, శైలజ తదితరులు పాల్గొన్నారు.