Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎస్ టి యు నాయకులు 

రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎస్ టి యు నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్
హైదరాబాదులోని కాచిగూడ లోగల ఎస్ టి  యు భవన్లో స్టేట్ టీచర్స్ యూనియన్ 79 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రాష్ట్ర నాయకత్వ దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ చీమల శ్రీకాంత్ మాట్లాడుతూ.. పి ఆర్ సి, డి ఏ ,పెండింగ్ బిల్లులు, డైట్ కళాశాలలో యందు ప్రమోషన్స్,317సమస్యను, ఓ పి ఎస్ పునరుద్ధరణ  లాంటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని  కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో శిక్షణ  తరగతుల పేరిట ఉపాధ్యాయులకు అనేక శిక్షణ కార్యక్రమం చేపట్టడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుంది కావున శిక్షణ తరగతులను తగ్గించాలని అవసరమైతే వేసవి సెలవులు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఎస్ ధర్మేందర్, స్టేట్ కౌన్సిలర్స్ ఏ శ్రీనివాస్, బి శ్రీనివాస్, పీ. బాలచంద్రములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -