Wednesday, November 12, 2025
E-PAPER
Homeజిల్లాలుఆన్ లైన్ గేమ్ కు అలవాటు పడి దొంగగా మారిన విద్యార్థి

ఆన్ లైన్ గేమ్ కు అలవాటు పడి దొంగగా మారిన విద్యార్థి

- Advertisement -

– 13 గ్రాముల బంగారం చైన్ స్వాధీనం

– ఏఎస్పీ బి.చైతన్య

నవతెలంగాణ – కామారెడ్డి

21 సంవత్సరాలు నిండిన ఒక విద్యార్థి ఆన్లైన్ గేమ్ కొలవటపడి దొంగగా మారిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుందని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడి ఒక మహిళా మెడలో నుండి బంగారు చైస్ దొంగతనం చేసిన పారిపోయిన దొంగను ఏఎస్పీ విద్యార్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగిందని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక డిఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ వివేకానంద కాలనిలో జరిగిన చైన్ తన మెడలో నుంచి చైన్ను దొంగలించడం జరిగిందని కొండ లలిత అనే మహిళా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కి వచ్చి, తాను ఒక్కతే ఇంట్లో ఉండగా, ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి తన ఇంటికి వచ్చి మంచినీళ్లు కావాలని అడిగినాడని, దాంతో ఆ మహిళ అతనికి ఒక ప్లాస్టిక్ గ్లాస్ లో నీళ్లు పోసి ఇవ్వగా, అతను అట్టి నీళ్ళు త్రాగి, ఇంకా నీళ్లు కావాలి అని అడిగినాడు, ఆ మహిళా మళ్ళీ ప్రధాన ద్వారం దర్వాజా కొద్దిగా తెరిచి, డోర్ సందులో నుండి నీళ్లు పోసి గరిటతో, గ్లాస్ లో నీళ్లు పోసి, డోర్ వేసుకునే క్రమంలో, అట్టి వ్యక్తి మేష్ డోర్ ను గట్టిగా గుంజి తెరిచి, ఆమె మెడలోని రుద్రాక్షతో కూడిన బంగారు చైన్ లాక్కుని పారిపోయినాడని పిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయం లో కామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది నిందితుడు వచ్చి వెళ్ళిన మార్గాలలో గల సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా, నేరం జరిగిన ఇంటికి కొద్ది దూరంలో ఒక ఇంటి వద్ద, రైల్వే స్టేషన్ నుండి నడుచుకుంటూ మున్సిపల్ ఆఫీస్ వైపు వెళుతున్న ముగ్గురు ఎన్ సి సి పిల్లలు, ఒక ఇంటి మొదటి అంతస్తులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనబడగా, వారు అతన్ని పట్టుకొనీ విచారించగా తాను ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగతనం చేసుకొని పారిపోవుతున్నానని, తాను పారిపోయి వస్తుండగా తన చెప్పులు ఆమె ఇంటి వద్ద వదిలేసినానని, అందుకోసమని ఇంటి పైకి ఎక్కి డోర్ బయట గల బూట్లను తీసుకొని కిందికి వస్తున్నానని చెప్పడంతో వారు అతన్ని పట్టుకుని పట్టణ పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ఆ నిందితుడు రోహిత్ మారుతి దుయ్యవార్ ఒక విద్యార్థి అని ఇతడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని రవీందర్, ముగావ్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగిందన్నారు. నిందితుణ్ణి అరెస్టు చేసి అతని వద్ద నుండి 13 గ్రాముల బంగారు చైన్ స్వాదిన పరచుకొని, నిందితున్ని న్యాయస్థానంలో హాజీర్ పరచడం జరుగుతుందన్నారు. నిందితుని వద్ద నుండి సాంసంగ్ ఎ 20 బ్లాక్ కలర్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -