నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ యూనివర్సిటీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చూస్తుండగానే ఒక ప్రొఫెసర్‌పై విద్యార్థిని దాడికి పాల్పడింది. ఇటీవల యూనివర్సిటీలో విద్యార్థి మండలి ఎన్నికలు జరిగాయి. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) నుంచి ఒక అభ్యర్థి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ఏబీవీపీ సభ్యులు మరో రెండు స్థానాలు గెలుచుకున్నారు. అయితే ఎన్ఎస్‌యూఐ విజేతను ఏబీవీపీ మద్దతుదారులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విశ్వవిద్యాలయం యాజమాన్యానికి ఫిర్యాదు అందింది.
దీంతో ఈ సమస్య పరిష్కారానికి ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కళాశాల ప్రొఫెసర్ సుజిత్ కుమార్‌ను కళాశాల క్రమశిక్షణా కమిటీ కన్వీనర్‌గా నియమించారు. ఇక దర్యాప్తులో భాగంగా గురువారం క్యాంపస్‌లో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఊహించని రీతిలో ప్రొఫెసర్ సుజిత్ కుమార్‌ను విద్యార్థి నాయకురాలు చెంపదెబ్బ కొట్టింది. పోలీసులు, అనేక మంది చూస్తుండగానే ఈ దాడి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉపాధ్యాయ, లెక్చరర్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విశ్వవిద్యాలయ బోధనా సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని వైస్-ఛాన్సలర్‌కు లేఖ రాశారు.