ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్‌లో ఘటన
నవతెలంగాణ-తాడూర్
‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి..’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్‌లో మంగళ వారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కొల్లాపూర్ నియోజకవర్గం మొలచింతల పల్లి గ్రామానికి చెందిన స్ఫూర్తి(21) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతోంది. మంగళ వారం హాస్టల్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి స్నేహితులు చూసి హాస్టల్ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే విద్యార్థినిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



